News April 21, 2024
వరంగల్: రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
డోర్నకల్ మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంలో 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 5, 2025
రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం: KTR
రాహుల్ గాంధీ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రచారం చేసింది రూ.15 వేలు.. అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అని చెప్పారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్, అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అని ‘X’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR తీవ్ర స్థాయిలో ధజమెత్తారు
News January 5, 2025
నేడు వరంగల్‌లో డిప్యూటీ సీఎం పర్యటన
వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్‌కు చేరుకొని అధికారులతో సమావేశం కానున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. సాయంత్రం 4 గంటలకు గీసుగొండ మండలం మొగిలిచర్ల, విశ్వనాథపురం, గొర్రేకుంటలకు సంబంధించిన విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారు. మొగిలిచర్లలో జరిగే సభలో పాల్గొంటారు.
News January 5, 2025
వరంగల్: స్థానిక పోరుకు సన్నద్ధం..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.