News December 19, 2025
మత్స్యకారులు సీఎం చంద్రబాబును కలిసే ఛాన్స్?

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఈనెల 20 శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాజయ్యపేట మత్స్యకారులు సీఎంను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ రెండు నెలలకు పైగా ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తానని హోంమంత్రి అనిత చెప్పడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. ఈనెల 16న సీఎంతో భేటీ రద్దు కావడంతో, తాళ్లపాలెంలో సీఎం అపాయింట్మెంట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
Similar News
News January 16, 2026
ఇరాన్ గగనతలం ఓపెన్.. ఖతర్ తిరిగొచ్చిన US బలగాలు

ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు US బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది.
News January 16, 2026
UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.
News January 16, 2026
విజయ్ హజారే ట్రోఫీ.. పైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ క్రికెట్ జట్టు కర్ణాటకపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 280 పరుగులు చేసింది. దర్శన్ నల్కాండే ఐదు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో విదర్భ యువ బ్యాటర్ అమన్ మొఖాడే 138 రన్స్‌తో సత్తా చాటారు. మరోవైపు ఈరోజు పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్ 18వ తేదీన విదర్భతో ఫైనల్‌లో తలపడనుంది.


