News April 21, 2024

మెజార్టీలో రికార్డు సృష్టిస్తారా? 1/2

image

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో 1989 నుంచి ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు. వరుసగా 7 సార్లు గెలుస్తూ వస్తున్నా ఆయన మెజార్టీ మాత్రం తగ్గుతూ వస్తోంది. 1989లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు 71,607 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1994లో 70వేలు, 1999లో 65,687, 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121, 2019లో 45,722 ఓట్ల మెజార్టీ లభించింది. ఈసారి భారీ మెజార్టీ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 1, 2026

కేరళం బీజేపీ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట

image

కేరళం ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ BJP మ్యానిఫెస్టో ప్రకటించింది. మహిళలు, వితంతువులు, 70ఏళ్లుపైబడిన వృద్ధులకు నెలకు ₹3వేల పెన్షన్ అందిస్తామంది. ప్రతిఇంటికీ నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీరు, ఓనమ్-క్రిస్మస్ పండగల కోసం పేదలకు ఏటా ఫ్రీగా రెండు LPG సిలిండర్లు ఇస్తామంది. మందులు, నిత్యావసర సరుకులపై పేద మహిళలకు ‘భక్ష్య ఆరోగ్య సురక్ష’ కార్డుతో ప్రతీనెల ₹2500 రీఛార్జ్ ఆఫర్ చేసింది.

News April 1, 2026

‘ధురంధర్-2’ స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’కు ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది. తన స్టోరీనే కాపీ కొట్టి సినిమా తీశారని కన్నడ డైరెక్టర్ ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆరోపించారు. 2023లోనే స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించానని.. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు కథ వినిపించానని తెలిపారు. ఇటీవల సినిమా చూడటంతో విషయం తెలిసిందని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.

News April 1, 2026

అర్షదీప్ సింగ్ ఖాతాలో చెత్త రికార్డు

image

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన చివరి ఓవర్‌లో అర్షదీప్ ఏకంగా 11 బంతులు వేశారు. దీంతో ఐపీఎల్‌లో సుదీర్ఘ ఓవర్ వేసిన ఆరో బౌలర్‌గా నిలిచారు. ఇప్పటికే తుషార్ దేశ్‌పాండే (CSK), సిరాజ్ (RCB), హార్దిక్ పాండ్య (MI), సందీప్ శర్మ (RR), శార్దూల్ థాకూర్ (LSG) పేరిట ఈ రికార్డ్ ఉంది.