News December 19, 2025

పెద్దపల్లి: పలు సూపర్ ఫాస్ట్ రైళ్ల రాకపోకలు ఆలస్యం

image

నార్త్ ఇండియాలో అధిక పొగమంచు కారణంగా గురువారం బయలుదేరిన పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయని SCR అధికారులు తెలిపారు. T.No.22692 నిజాముద్దీన్→KSR బెంగళూరు రాజధాని SF 5.30Hrs, T.No.20806న్యూఢిల్లీ→విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ SF 7Hrs, T.No.12622 న్యూఢిల్లీ→MGR చెన్నై తమిళనాడు SF 6Hrs, T.No.12626 న్యూఢిల్లీ→తిరువనంతపురం కేరళ SF 9Hrs, T.No.12722 నిజాముద్దీన్→హైద్రాబాద్ దక్షిణ్ SF 5Hrs.

Similar News

News January 22, 2026

మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

image

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్‌లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్‌తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.

News January 22, 2026

KMR: క్యాడర్ ఉన్నా గెలుపు గుర్రాలు ఎక్కడ?

image

కామారెడ్డి జిల్లాలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఈ పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, హిందూత్వ భావజాలం ప్రధాన బలాలు. పట్టణ ప్రాంతాల్లో మోదీ చరిష్మా పార్టీకి కలిసొచ్చే అంశం. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం బీజేపీకి ప్రధాన బలహీనతగా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా అధికార కాంగ్రెస్‌ను ఢీకొట్టే స్థాయిలో వ్యూహా రచన చేయాలి.

News January 22, 2026

బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

image

ఈ సీజన్‌లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.