News December 19, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు

ఏపీ ఇంటర్ బోర్డు రెండు పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మ్యాథ్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2లను మార్చి 4న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 3) నిర్వహిస్తామని ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1, లాజిక్ పేపర్1 మార్చి 21న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 20) ఉంటాయని తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 10, 2026
శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
News January 10, 2026
తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


