News December 19, 2025

పతాక నిధి సేకరణలో గుంటూరుకు ప్రథమ స్థానం

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి రూ. 17,67,363 నిధులు సేకరించినందుకు గానూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ జాబితాలో బాపట్ల ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి.

Similar News

News December 31, 2025

GNT: Bro.. ఈరోజు సాయంత్రం ప్లాన్ ఏంటి.?

image

నేటితో 2025 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఇవాళ DEC 31st కావడంతో ఇప్పటికే చాలా మంది పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రాత్రి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీలకు ముందస్తు ప్లాన్స్ చేసుకున్నారు. కొందరు బార్లు, ఇంకొందరు ఇంట్లో, బయట వెకేషన్లలో.. లొకేషన్ ఏదైనా ప్రిపరేషన్ మాత్రం వేడుకలే. పార్టీలో ముక్కా, చుక్కా తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు. మీ సాయంకాలం ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.

News December 31, 2025

GNT: పోటాపోటీగా నేతల పర్యటనలు.. క్యాడర్ అయోమయం.!

image

తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబు పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. ఏడాదికి పైగా రాజకీయాలకు దూరంగా ఉన్న సుచరిత తాజాగా నియోజకవర్గంలో వరుస పర్యటనలతో తాడికొండ YCP రాజకీయం కాస్త ఆసక్తిగా మారి.. గ్రూపు రాజకీయాలు మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయి క్యాడర్‌ ఎటువైపు ఉండాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరికి ఇద్దరూ కాకుండా వేరొక వ్యక్తి వస్తారనే టాక్ కూడా నడుస్తోంది.

News December 30, 2025

తెనాలి: పోక్సో కేసులో నిందితుడికి జైలు, జరిమానా.!

image

ప్రేమ పేరుతో బాలికను వేధించిన కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తెనాలి ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సుల్తానాబాద్‌‌లో 14 ఏళ్ల బాలికను 22 ఏళ్ల తమ్మిశెట్టి వినయ్‌ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయగా బాలిక తల్లి 2022 మే 2న త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం కేసు విచారించిన పోక్సో స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి సాక్షాదారాలను పరిశీలించి నిందితుడికి జైలు జరిమానా విధించారు.