News December 19, 2025
NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు

కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎంగంపల్లి తండా గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అవి పెద్దపులి జాడలేనని నిర్ధారించారు. రాత్రివేళ పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, పులి సంచారం గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News January 16, 2026
ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

BMC ఎన్నికల కౌంటింగ్‌లో BJP+ దూసుకుపోతోంది. ఏక్‌నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్‌లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.
News January 16, 2026
పాణ్యం మండలంలో విషాదం

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.