News December 19, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 168 మంది గైర్హాజరు

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.
Similar News
News January 1, 2026
విశాఖలో భారీగా కేసుల నమోదు

నగరంలోని బుధవారం సాయంత్రం నుంచి 83 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2,721 వాహనాలు తనిఖీ చేయగా బహిరంగ మద్యం కేసులు 99, మోటార్ వెహికల్ కేసులు 644, హెల్మెట్ ధరించని కేసుు 506, త్రిబుల్ రైడింగ్ 34, డ్రంక్ అండ్ డ్రైవ్ 257, ఇతర మోటర్ వెహికల్ కేసులు 103 నమోదు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. గురువారం కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 1, 2026
విశాఖ రేంజ్ ఐజీగా బాధ్యతలు చేపట్టిన గోపినాథ్ జట్టి

విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న గోపినాథ్ జట్టి పదోన్నతిపై గురువారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP)గా బాధ్యతలు స్వీకరించారు. రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పోలీసు అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. పూల మొక్కలు (Saplings) అందజేసి నూతన సంవత్సర, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 1, 2026
విశాఖలో తొలిసారిగా మొబైల్ వాటర్ టెస్టింగ్ లాబొరేటరీ

ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే మొట్ట మొదటగా విశాఖ నగరంలో మొబైల్ వాటర్ టెస్టింగ్ లేబొరేటరీను గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. నగరంలోని అన్ని వార్డుల పరిధిలో ఉన్న నివాస ప్రాంతాల వద్దకే ఈ వాహనం నేరుగా వెళ్తుందన్నారు. ప్రజలు తాము తాగే నీరు ఎంతవరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చన్నారు. నగర ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


