News December 19, 2025
కాకినాడ: ప్రజా దర్బార్లు.. పరిష్కారమా? పోటీనా?

ప్రతి సోమవారం అధికారులు నిర్వహించే ‘PGRS’కు సమాంతరంగా కూటమి నేతలు ‘ప్రజా దర్బార్లు’ నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతలు స్వీకరించే అర్జీలు తిరిగి అధికారుల వద్దకే వెళ్తున్నప్పుడు, వీటివల్ల అదనపు ప్రయోజనం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సాక్షాత్తు కలెక్టర్, ఎస్పీలు నిర్వహించే కార్యక్రమాలకు ఇవి పోటీగా మారాయేతప్ప, సమస్యల పరిష్కారంలో స్పష్టతలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
Similar News
News January 22, 2026
ఏలూరు: జాతర రూట్ మ్యాప్‌ను పరిశీలించిన ఎస్పీ

ఏలూరు తూర్పు వీధిలో ఈనెల 25, 26 తేదీల్లో జరగనున్న గంగానమ్మ తల్లి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. గురువారం అమ్మవారిని దర్శించుకున్న ఆయన, జాతర నిర్వహించే మార్గాలను (రూట్ మ్యాప్) స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News January 22, 2026
OTTలోకి కొత్త సినిమాలు

ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు కొత్త సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలోకి రానున్నాయి. ధనుష్, కృతిసనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) నెట్‌ఫ్లిక్స్‌లో, కిచ్చా సుదీప్ ‘మార్క్’ జియో హాట్‌స్టార్‌లో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ’45’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శోభితా ధూళిపాళ్ల ‘చీకటిలో’ రానుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌లో ‘మోగ్లీ’ అందుబాటులోకి వచ్చింది.
News January 22, 2026
త్వరలో జలమండలి విస్తరణ షురూ!

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.


