News December 19, 2025
ప్రకృతి విపత్తులపై ముందస్తు ప్రణాళిక రచించాలి: కలెక్టర్

ప్రకృతి విపత్తులపై ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సి.ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి విపత్తులు, మాక్ డ్రిల్ అవగాహన అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫిడెన్స్‌లో మాట్లాడారు. విపత్తులు సంభవించినప్పుడు అధికారులు యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తారు అనే అంశంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.
News January 3, 2026
మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.
News January 3, 2026
RJY: ‘గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి’

రంపచోడవరం జిల్లాకు గిరిజన వీరుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. తమ్మన్నదొర త్యాగాన్ని కేంద్రం గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.


