News December 19, 2025

నల్గొండ: ‘అమ్మా SORRY.. నేను చనిపోతున్నా’

image

నల్గొండ టౌన్ పరిధి చర్లపల్లిలోని <<18614490>>సాంఘిక సంక్షేమ వసతి గృహంలో<<>> విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. బాలిక రాసిన సూసైడ్ లెటర్ రూమ్‌లో లభ్యమైంది. ‘అమ్మా సారీ.. నాకు బతకాలని లేదు.. నేను నీకు రుణపడి ఉంటానమ్మా.. నేను చనిపోయాక నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతారు అవి పట్టించుకోకు.. ఏం తప్పు చేయకపోయినా ఈ సమాజం నిందలు మోపుతుంది.. నీ ప్రేమను మర్చిపోనమ్మా’ అని రాసింది.

Similar News

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.

News January 14, 2026

మేడారం గద్దెల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..!

image

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలో ప్రాంగణంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లుల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరెంటు వైరు పలుచోట్ల తెగి కనిపించడంతో పాటు అతుకులుగా ఉన్నాయి. భక్తులు ఎవరైనా చూసుకోకుండా వాటిపై కాలు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

News January 14, 2026

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

image

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.