News December 19, 2025

రేపు పెరవలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:50 గంటలకు పెరవలి చేరుకుంటారు. రూ.3,040 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి మంగళగిరి బయలుదేరుతారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Similar News

News January 9, 2026

సంక్రాంతి వేళ డ్రోన్ల నిఘా.. ఎస్పీ వార్నింగ్!

image

సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.

News January 9, 2026

రాజమండ్రి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా

image

రాజమండ్రిలో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళా బ్రోచర్‌ను మాజీ ఎంపీ మార్గాని భరత్ గురువారం విడుదల చేశారు. మంజీర కన్వెన్షన్‌లో ఈ మెగా జాబ్ కార్యక్రమం జరగనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని భరత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News January 8, 2026

రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.