News December 19, 2025

భద్రాచలం-మేడారం రోడ్ల అభివృద్ధికి నిధులు: కిషన్‌రెడ్డి

image

ములుగు జిల్లా బీజేపీ నేతలు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనవరిలో జరిగే మహాజాతరలో రావాలని ఆహ్వానించారు. అనంతరం మేడారం జాతరకు కేంద్రం నుండి నిధులు మంజూరు చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. భద్రాచలం నుంచి మేడారం, కాలేశ్వరం వరకు రోడ్లను అభివృద్ధి చేసి సమ్మక్క, సారక్క యూనివర్సిటీకి నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి అన్నారు.

Similar News

News January 15, 2026

BREAKING: సంగారెడ్డి: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 15, 2026

‘సెంటిమెంట్’ను నమ్ముకున్న ‘బలగం’ వేణు!

image

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమాతో హిట్ కొట్టిన వేణు మరోసారి జనాల ఎమోషన్‌ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ‘బలగం’లో ఓ ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని కథగా తీసుకొని జనాలను థియేటర్లకు రప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. తాజాగా విడుదలైన ‘ఎల్లమ్మ’ <<18865101>>గ్లింప్స్<<>> చూస్తే అదే ఫార్ములా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఈసారి దైవం-ఆచారం చుట్టూ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. మీకు గ్లింప్స్ ఎలా అనిపించింది?

News January 15, 2026

ఎల్లుండి నుంచి స్కూళ్లు.. శనివారమూ హాలిడే ఇవ్వాలని రిక్వెస్టులు

image

TG: ప్రభుత్వ జీవో ప్రకారం స్కూళ్లకు రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. శనివారం (17) నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే కనుమ జరిగిన నెక్స్ట్ రోజే సొంతూళ్ల నుంచి ఎలా రాగలమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. శనివారమూ హాలిడే ఇస్తే ఎలాగూ ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఫ్రెష్‌గా పిల్లలను పంపొచ్చంటున్నారు. మరి మీ పిల్లలను ఎప్పటి నుంచి స్కూళ్లకు పంపుతారు? కామెంట్ చేయండి.