News December 19, 2025
డీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా ఖమ్మం కలెక్టర్ బాధ్యతలు

ఖమ్మం జిల్లా డీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని నియమించింది. శుక్రవారం కలెక్టరేట్లో డీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 24, 2025
చొప్పదండి: జాతీయ స్థాయిలో రాణిస్తున్న నవోదయ విద్యార్థులు

జవహర్ నవోదయ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ప్రశంసించారు. ఇటీవల లక్నోలో జరిగిన ఎస్జీఎఫ్ఐ పోటీల్లో నవోదయ విద్యార్థి శ్రీ హర్షిని జాతీయ స్థాయిలో 10వ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు. అలాగే కన్యాకుమారిలో జరిగిన యోగా పోటీల్లో సాక్షిత్ జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని గెలుచుకున్నాడని చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చిన పీడీలు S.రాధిక, B.వేణుగోపాల్‌ను అభదించారు.
News December 24, 2025
PHOTO: కొత్త సర్పంచులతో సీఎం రేవంత్

TG: ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. సర్పంచులను సన్మానించి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
News December 24, 2025
జగిత్యాల: ‘వ్యవసాయ విద్యార్థులు కృషి చేయాలి’

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి అధిక పంట దిగుబడులకు వ్యవసాయ విద్యార్థులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల మండలం పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో విద్యార్థులతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, వీసీ జానయ్య ఉన్నారు.


