News April 21, 2024
అప్పట్లో ఈమె క్రేజే వేరు!

SRH మ్యాచ్‌లంటే కావ్యా మారన్ ఫేమస్. అయితే అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీకి గాయత్రి రెడ్డి వల్ల ఫుల్ క్రేజ్ ఉండేది. IPL ప్రారంభ ఎడిషన్‌లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ కొనుగోలు, ప్లేయర్ల వేలం, జెర్సీ ఇలా ప్రతి విషయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆమె ఓనర్‌గా ఉండగానే 2009లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ టైటిల్ గెలిచింది. ప్రస్తుతం SRH వరుస విజయాలతో ఫ్యాన్స్ గాయత్రి రెడ్డిని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Similar News
News March 20, 2026
ఈరోజు స్కూళ్లు యధాతథం: విశాఖ డీఈవో

రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 20, 2026
SRH జట్టుకు మరో షాక్!

IPL: మొదటి కొన్ని మ్యాచ్‌లకు ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ దూరం కాగా SRH జట్టుకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగినట్లు Cricbuzz తెలిపింది. అయితే గాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇటీవల వేలంలో AUSకు చెందిన ఈ ప్లేయర్‌ను SRH రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇద్దరు పేసర్లు లేకపోవడం SRH బౌలింగ్ విభాగానికి తలనొప్పిగా మారింది.
News March 20, 2026
ఇక్కడి LPG మన అవసరాలకే: హైకోర్టు

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉత్పత్తి చేసే LPGని దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని AP హైకోర్టు ఆదేశించింది. లేదంటే సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం LPGని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


