News December 19, 2025
రామగుండం: ‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష భరోసా ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News January 20, 2026
‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
News January 20, 2026
MHBD: వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ

జిల్లావ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యేలు, అధికారులు పలు మండలాల్లో పాల్గొన్నారు. డోర్నకల్, MHBD, తొర్రూర్ మండలాలలో ఆయా ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, మురళి నాయక్, యశస్విని రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 947 ఎన్ఎస్‌జీ బృందాలకు రూ.3,28,26,274 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News January 20, 2026
నంద్యాల: గ్రేట్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు!

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ ఆస్తిని మాధవరం రాముల గుడికి విరాళంగా ఇచ్చారు. సంతానం లేని ఈ దంపతులు రూ.2కోట్ల విలువ చేసే తమ ఆస్తి మొత్తాన్ని ఆలయానికే చెందేలా గ్రామ పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తూ గుడి కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. వృద్ధ దంపతుల దాతృత్వాన్ని గ్రామస్థులు అభినందించారు.


