News April 21, 2024
ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే: అంబటి

AP: తాను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2019లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా.. తాను నైతికంగా ఓడినట్లే అని అన్నారు. తనకు టికెట్ రాదని కూటమి నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 25, 2026
220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://avnl.co.in లేదా www.ddpdoo.gov.in
News January 25, 2026
వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు

⋆ వాట్సాప్‌లో ‘సెకండరీ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. పిల్లల కోసం పేరెంట్స్ ఈ అకౌంట్స్ క్రియేట్ చేయవచ్చు. వీటిలో స్టేటస్/ఛానల్ అప్‌డేట్స్ రావు. కాంటాక్ట్స్‌లో లేని వారితో చాట్ చేయరాదు.
⋆ IOS యూజర్లకు చాట్ హిస్టరీ షేరింగ్ ఆప్షన్ రానుంది. గ్రూప్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్లు కొత్త మెంబర్‌కి 100 మెసేజ్‌లను షేర్ చేయొచ్చు.
⋆ యూరప్, UKలో యాడ్ ఫ్రీ ఫీచర్ రానుంది. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు.
News January 25, 2026
ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. ఇవి తెలుసా?

AP: ఈ ఏడాది ఇంటర్ పరీక్షల సరళి మారింది. మ్యాథ్స్ (A,B) ఒకే సబ్జెక్టుగా, బాటనీ, జువాలజీలను విలీనం చేయడంతో గ్రూపు సబ్జెక్టులు 6 నుంచి 5కు తగ్గాయి. కొత్తగా వచ్చిన ఎలక్టివ్ విధానంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చు. చాలా మంది MBiPC వైపు మొగ్గు చూపుతున్నారు. రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున 23 రోజులు పరీక్షలు జరుగుతాయి. మార్కుల విషయంలోనూ మార్పులు చేశారు. ఆన్సర్ షీట్ పేజీలను 32కు పెంచారు.


