News December 19, 2025

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన

image

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్ యాదవ్ రెండు రోజుల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన ఈనెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు అన్నవరం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ అన్నవరం నుంచి కాకినాడ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు అన్నవరంలో బయల్దేరి కాకినాడ విచ్చేస్తారు. కాకినాడలో జరిగే వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ, పల్స్ పొలియోలో పాల్గొంటారని జిల్లా సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News January 16, 2026

విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.

News January 16, 2026

చిత్తూరు: గొర్రెల మందపై చిరుత దాడి!

image

పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందగా మరొక గొర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్యంకు చెందిన కృష్ణయ్య తన 40 గొర్రెలను శుక్రవారం అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందిందని, మరొక గొర్రెకు గాయాలయ్యాయన్నారు. ఇంకో గొర్రె అదృశ్యమైనట్లు గుర్తించామని రైతు తెలిపారు.

News January 16, 2026

IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

image

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.