News April 21, 2024
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

ఏలూరు నుంచి కర్నూలుకు వస్తున్న క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనం గిద్దలూరు ఘాట్ రోడ్ బొగద మలుపు వద్ద ఆదివారం తెల్లవారుజామున కొండచరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఏలూరు నుంచి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండచరియను ఢీకొంది. ఆ సమయంలో డ్రైవర్ పెద్దరాజు కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు.
Similar News
News January 19, 2026
వాట్సాప్‌లోనే FIR కాపీ.. స్టేషన్లకు వెళ్లక్కర్లేదు!

మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని SI హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ ఎంటర్ చేస్తే ఉచితంగా కాపీ లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ నూతన విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2026
కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
News January 18, 2026
కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.


