News December 19, 2025

టాప్10 ట్వీట్స్‌లో 8 మోదీ చేసినవే..

image

గడిచిన 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్స్‌లో 8 ప్రధాని మోదీ చేసినవేనని ఎక్స్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మోదీ భగవద్గీత అందిస్తున్న పోస్ట్‌కు 74వేల మంది లైక్ కొట్టారు. భారత్‌లో అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్ల లిస్ట్‌లో మోదీ తప్ప మరో పొలిటీషియన్ లేరు. ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్‌’లో అత్యధిక మంది ఫాలో (105.9M) అవుతున్న 4వ వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కారు.

Similar News

News January 8, 2026

వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.

News January 8, 2026

చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News January 8, 2026

పుష్ప స్టైల్‌లో స్మగ్లింగ్.. డీజిల్ ట్యాంక్‌లో ₹25 లక్షల డ్రగ్స్‌

image

ఇండోర్‌ (MP)లో Pushpa సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్‌ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా ₹25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్‌ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్‌స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనక ఉన్న గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు.