News December 19, 2025
‘రాజన్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి’

వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తులకు మెరుగైన వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఆర్ అండ్ బీ సీఈ, శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు.
Similar News
News January 5, 2026
బాపట్ల: ఎస్పీ కార్యాలయ పీజీఆర్ఎస్‌కి 67 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 67 అర్జీలు అందినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
News January 5, 2026
తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్‌కు 26 ఆర్జీలు

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.
News January 5, 2026
గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.


