News December 19, 2025

వాస్తు ప్లాన్లలో ఉత్తర దిశ ప్రాధాన్యత

image

వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇంటి లేఅవుట్లలో ఉత్తర దిశనే ప్రామాణికంగా గుర్తిస్తారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర దిశ నుంచి నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘పంచభూతాల సమన్వయానికి ఈ దిశ దిక్సూచిలా పనిచేస్తుంది. వినాయక వృత్తాంతంలోనూ ఉత్తర దిశ విశిష్టత గురించి ఉంది. అందుకే ప్లాన్లలో దిశల స్పష్టత కోసం ఉత్తరాన్ని వాడుతారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News January 26, 2026

నేడు వీటిని దానం చేస్తే..

image

ఈరోజు దానధర్మాలు చేస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. నేడు బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేష్ఠం. ఆవులకు పశుగ్రాసం తినిపించి, వైష్ణవాలయాలను సందర్శించాలి. ఇలా భక్తితో దానాలు చేసి ఉపవాసం ఉంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, గ్రహ దోషాలు నశించి వంశాభివృద్ధి, మనశ్శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ చిన్న సాయం జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది.

News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 26, 2026

ఈ 5 రోజులు ఎంతో పుణ్యమైనవి.. ఎందుకంటే?

image

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను ‘భీష్మ పంచకాలు’ అంటారు. యుద్ధంలో గాయపడిన భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే సప్తమి నుంచి 5 రోజుల పాటు ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ అష్టమి నాటికి సిద్ధమయ్యారు. ఈ 5 రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో చేసే జపతపాలు అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.