News December 19, 2025
గుంటూరు జిల్లా విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యలు

గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అప్పటి డీఈఓగా పనిచేసిన గంగాభవానితో పాటు మరో ఏడుగురు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నంబర్ 20 ప్రకారం విచారణ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 19, 2026
GNT: ఈ-క్రాప్‌కు కొత్త నిబంధనలు.. రైతులకు ఊరట

గుంటూరు జిల్లాలో రైతులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ-క్రాప్ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో నమోదు సరిగా కాక చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రబీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. రైతు సమక్షంలోనే పొలంలో నమోదు చేయాలని ఆదేశించింది. సాగు భూమితో పాటు ఖాళీ భూములను కూడా ల్యాండ్ పార్శిల్‌గా నమోదు చేస్తున్నారు.
News January 18, 2026
రెవెన్యూ క్లినిక్‌లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News January 18, 2026
సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.


