News December 19, 2025
సూర్యాపేట: ఆ బిల్లును వెంటనే ఉపసంహరించాలి: జూలకంటి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో కూలీలు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ ఈనెల 20 నుంచి 23 వరకు జిల్లా వ్యాప్తంగా బిల్లుపత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 22, 2026
Republic day Special: మేడం బికాజీ కామా

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.
News January 22, 2026
ఏలూరు: జాతర రూట్ మ్యాప్‌ను పరిశీలించిన ఎస్పీ

ఏలూరు తూర్పు వీధిలో ఈనెల 25, 26 తేదీల్లో జరగనున్న గంగానమ్మ తల్లి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. గురువారం అమ్మవారిని దర్శించుకున్న ఆయన, జాతర నిర్వహించే మార్గాలను (రూట్ మ్యాప్) స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News January 22, 2026
OTTలోకి కొత్త సినిమాలు

ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు కొత్త సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలోకి రానున్నాయి. ధనుష్, కృతిసనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) నెట్‌ఫ్లిక్స్‌లో, కిచ్చా సుదీప్ ‘మార్క్’ జియో హాట్‌స్టార్‌లో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ’45’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శోభితా ధూళిపాళ్ల ‘చీకటిలో’ రానుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌లో ‘మోగ్లీ’ అందుబాటులోకి వచ్చింది.


