News December 19, 2025

VJA: సీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఎన్టీఆర్ జిల్లా సీపీ కార్యాలయంలో పోలీస్ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల ఆదర్శాలు అందరూ పాటించాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

జనవరి 23: చరిత్రలో ఈరోజు

image

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)

News January 23, 2026

జనగామ: ఆ గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) కొడవటూరు గ్రామం ఆదర్శపథంలో పయనించేందుకు సిద్ధమైంది. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని నూతన పాలకవర్గం చారిత్రాత్మక తీర్మానం చేసింది. ఈనెల 26న గణతంత్ర్య దినోత్సవం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అక్రమ విక్రయాలను పట్టించిన వారికి రూ.10 వేల బహుమతి అందజేస్తామని సర్పంచ్ కవిత మురళి వెల్లడించారు.

News January 23, 2026

మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

image

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.