News December 19, 2025

సంగారెడ్డి: రేపు ఫుడ్ లైసెన్స్ మేళా

image

ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళాను శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఫుడ్ ఇన్స్ పెక్టర్ నారాయణఖేడ్‌లోని వెంకటేశ్వర థియేటర్‌లో ఉదయం 10 గంటల నుంచి మేళా జరుగుతుందని చెప్పారు. వ్యాపారులు ఆహార లైసెన్సుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News January 17, 2026

కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

image

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.

News January 17, 2026

సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

image

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.

News January 17, 2026

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.