News December 19, 2025
పెద్దపల్లి: ‘ప్రజల విశ్వాసం మరింత బలపడింది’

గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా అదనపు ఎన్నికల అధికారి & పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యకు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు గురువారం సన్మానం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఆయన అందించిన మార్గదర్శకత్వం, సమన్వయం కీలకమని అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని అన్నారు.
Similar News
News January 17, 2026
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 17, 2026
ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News January 17, 2026
మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.


