News December 19, 2025
జగిత్యాల: లక్షలాది భక్తులకు సౌకర్యాలే లక్ష్యం: కలెక్టర్

2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి గోదావరి తీరంలోని ఆలయాలు, పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్, తాగునీరు, వసతి సదుపాయాలతో శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
Similar News
News February 17, 2026
AIIMS రిషికేశ్‌లో ఉద్యోగాలు

<
News February 17, 2026
నేడు విశాఖకు రాష్ట్రపతి రాక

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నానికి రానున్నారు. తూర్పు నౌకాదళ కేంద్రంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ-2026కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరవుతారు. నేవల్ బేస్‌లో జరిగే అధ్యక్ష విందులో పాల్గొంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, విదేశీ, స్వదేశీ ప్రముఖులు విశాఖ రానున్నారు.
News February 17, 2026
రాజకీయాల్లో కాదేదీ అనర్హం.. వైరాలో వింత పరిస్థితి

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వింత పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెంలో సీపీఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, వైరాలో మాత్రం అదే పార్టీపై గెలిచిన వారికే పగ్గాలు అప్పగించింది. సీపీఎం అభ్యర్థులపై విజయం సాధించిన కాపా చంద్రకళ ఛైర్మన్‌గా, కట్ల సంతోష్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒకచోట మిత్రపక్షంగా, మరోచోట ప్రత్యర్థులుగా ఉన్న ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


