News December 19, 2025

నేర పరిశోధనలో NTR జిల్లా పోలీసులకు ‘ABCD’ అవార్డు

image

నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన NTR జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. 2025 మొదటి త్రైమాసికంలో పటమట పరిధిలో జరిగిన రూ.3 కోట్ల విలువైన 271 ఐఫోన్ల చోరీ కేసును రికార్డు సమయంలో ఛేదించినందుకు గాను వీరికి ‘ఏబీసీడీ’ (ABCD) అవార్డు దక్కింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా నగర పోలీస్ కమిషనర్ ఈ అవార్డును అందుకున్నారు.

Similar News

News January 19, 2026

గుండె పదిలంగా ఉండాలా? అయితే బెడ్ రూమ్ లైట్లు ఆపేయండి!

image

నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు ఉంటే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని JAMA Network Open తాజా స్టడీలో తేలింది. సుమారు 89,000 మంది గుండె పనితీరును ట్రాక్ చేశారు. లైట్లు వేసుకుని పడుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 47%, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56% ఎక్కువగా ఉంటుందట. ఈ వెలుతురు బాడీలోని సర్కేడియన్ రిథమ్‌ను దెబ్బతీసి స్ట్రెస్ పెంచుతుందట. అందుకే హెల్తీగా ఉండాలంటే చీకట్లోనే నిద్రపోవాలి.

News January 19, 2026

23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్

image

ఈనెల 23న SC, ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని ఆదేశించారు.

News January 19, 2026

సంపు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

image

ఇంటి ప్రాంగణంలో బోరు, ఇంకుడు గుంతలు ఎక్కడున్నా, నీటిని నిల్వ చేసే ‘సంపు’ మాత్రం కచ్చితంగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లోనే ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సంపు కట్టేటప్పుడు అది ఇంటి మూలకు, ప్రహరీ గోడ మూలకు తగలకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. వాస్తుతో పాటు నిర్మాణ భద్రత వంటి శాస్త్రీయ కోణాలను కూడా దృష్టిలో ఉంచుకుని సంపు నిర్మాణం చేపడితే మేలు జరుగుతుందని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>