News December 19, 2025

HYDలో బ్రెడ్ క్రంబింగ్‌ ట్రెండ్.. బకరాలు లోడింగ్!​

image

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.

Similar News

News January 15, 2026

మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్

image

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాల్లేవని <<18592868>>ఐదుగురు<<>> MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు.

News January 15, 2026

తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజులు జరిగిన ధనుర్మాస కైంకర్యాలు నిన్నటితో ముగిశాయి. డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వరకు ధనుర్మాసం సాగింది. ఈ సందర్భంగా సుప్రభాత సేవ నిలిపేశారు. తిరుప్పావై పాశురాల పారాయణంతో స్వామివారిని మేల్కొలిపారు. ధనుర్మాసం ముగియడంతో గురువారం వేకువజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు పూర్తి చేశారు.

News January 15, 2026

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.