News December 19, 2025
సంగారెడ్డి: 22న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం: కలెక్టర్

విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్‌తో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.
Similar News
News January 2, 2026
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో ముందుకు: కలెక్టర్

జిల్లా అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు నడవాలని కలెక్టర్ దివాకర అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితుడైన బైరెడ్డి భగవాన్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పని చేస్తామని, అధికారులు సహకారం అందించాలని భగవాన్ రెడ్డి కోరారు.
News January 2, 2026
ఆ ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదు: ఎల్.రమణ

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని ఎమ్మెల్సీ L.రమణ పేర్కొన్నారు. మండలిలో మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి KCR ప్రభుత్వం రూ.100 కోట్లతో జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేసిందని విమర్శించారు. కొండగట్టు పరిధిలో చేర్చిన భూములపై ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదని పేర్కొన్నారు.
News January 2, 2026
మారేడుబాక: విద్యార్థి గీసిన చిత్రాన్ని చూసి మురిసిపోయిన కలెక్టర్

మారేడుబాకలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి విచ్చేసిన కలెక్టర్ చేకూరి కీర్తికి అపురూపమైన కానుక లభించింది. స్థానిక ఎంపీఎస్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మానేపల్లి కీర్తి, కలెక్టర్ చిత్రాన్ని పెన్సిల్ ఆర్ట్‌తో అప్పటికప్పుడు చిత్రీకరించి అందజేశారు. విద్యార్థిని ప్రతిభను చూసి మురిసిపోయిన కలెక్టర్, ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పెన్సిల్ చిత్రపటం అక్కడి వారందరినీ విశేషంగా ఆకట్టుకుంది.


