News December 19, 2025

కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

image

ట్రాక్టర్‌పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.

Similar News

News January 5, 2026

కడప పోలీస్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.

News January 5, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
* వెండి 10 గ్రాముల ధర: రూ.2450.

News January 4, 2026

కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్‌గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.