News December 19, 2025
మేడారం పనులపై మంత్రి సీతక్క ఆరా

మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను శుక్రవారం రాత్రి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను తరగతి గదిలో పూర్తి చేయాలని గద్దెల పునరుద్ధరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆలయ ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
Similar News
News January 16, 2026
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.
News January 16, 2026
విజయవాడలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య!

విజయవాడ కేదారేశ్వరరావుపేటలో దారుణం జరిగింది. శివ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న హుస్సేన అనే వివాహిత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శివ కుమార్ ఆమెను హతమార్చి పరారైనట్లు సమాచారం. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News January 16, 2026
NLG: రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే పథకాలు కట్

వ్యవసాయ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును తప్పనిసరి చేసింది. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండలో ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోకపోవడంతో ఏఈవోలు లేదా మీ-సేవా కేంద్రాలను రైతులు సంప్రదించాలని వారు సూచించారు. భవిష్యత్తులో పథకాలు పొందాలంటే ఈ నమోదు కీలకమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.


