News December 19, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ మణుగూరు: ఆదివాసీలను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
✓ భద్రాచలంలో రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
✓ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలో ప్రత్యేక సర్వే
✓ గుండాల: గ్రూప్ 3లో సత్తా చాటిన రాకేష్
✓ ముక్కోటి వేడుకకు ముస్తాబైన పర్ణశాల
✓ చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికీ 6 నెలల జైలు శిక్ష
✓ అశ్వాపురం: డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ
✓ భద్రాద్రి జిల్లా వైద్య విధాన పరిషత్ సేవలు కొనియాడిన మంత్రి
Similar News
News January 18, 2026
సిద్దిపేట సీపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. నమ్మొద్దు: రష్మీ పెరుమాళ్

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతా సృష్టించి కొందరు కేటుగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఐడీ నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఎవరూ అంగీకరించవద్దని ఆమె కోరారు. సదరు ఖాతా నుండి ఎవరైనా మెసేజ్‌లు పంపి డబ్బులు అడిగినా లేదా వ్యక్తిగత సమాచారం కోరినా స్పందించవద్దని ప్రజలకు సూచించారు.
News January 18, 2026
జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.
News January 18, 2026
జగన్ రాజధాని కామెంట్లకు CM CBN కౌంటర్

AP: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ చేసిన కామెంట్లకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన బెంగళూరులో ఉంటే బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అదే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. 5ఏళ్లు ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. 3 రాజధానులు అని చెప్పిన ప్రాంతాల్లో కూడా NDA అభ్యర్థులు విజయం సాధించారని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని CBN పేర్కొన్నారు.


