News April 21, 2024
రవీశ్ యూట్యూబ్ ఆదాయం రూ.కోట్లలోనే!

ప్రముఖ జర్నలిస్ట్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ యూట్యూబ్ ఛానల్‌కు ఆదరణ భారీగా పెరిగింది. ప్రారంభించిన 16 నెలల్లోనే సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.6Mకు చేరింది. ఇప్పటివరకు 526 వీడియోలను అప్‌లోడ్ చేయగా 980M+ వ్యూస్ వచ్చాయి. దీంతో ఆయన ఆదాయం రూ.కోట్లలోనే ఉన్నట్లు సైడ్ హస్టిల్ వీకెండ్ నివేదిక తెలిపింది. యూట్యూబ్ నుంచి రవీశ్‌కు నెలకు రూ.33 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు వస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News April 1, 2026
15 ఏళ్ల తర్వాత.. సెన్సస్-2027 ప్రారంభం

2011 తర్వాత దేశంలో మళ్లీ జనగణనకు వేళయింది. సెన్సస్-2027 ఇవాళ ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు నివాసాల జాబితా, గణన చేపడతారు. కేంద్రం ప్రతి రాష్ట్రానికి 30 రోజుల సమయం ఇచ్చింది. APలో మే 1-30 మధ్య, TGలో మే 11-జూన్ 9 మధ్య కొనసాగనుంది. దీనికి 15 రోజుల ముందు ప్రజలు తామే స్వయంగా ఆన్‌లైన్‌లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా వివరాలు సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగిశాక 2027 ఫిబ్రవరిలో అసలైన జనగణన మొదలవుతుంది.
News April 1, 2026
మార్కెట్లో బుల్ జోరు!

పశ్చిమాసియా యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధర తగ్గడంతో ఇవాళ బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,900 పాయింట్లు ఎగసి 73,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 22,910 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News April 1, 2026
చికెన్ తింటున్నారా?

TGలో ఇవాళ్టి నుంచి చికెన్ షాపుల <<19529303>>బంద్<<>> కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


