News December 19, 2025

​రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: హనుమకొండ కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి, అక్కడ రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్, రవాణా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 9, 2026

అప్పన్న దేవాలయం మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలు

image

సింహాచలం ఆలయంలో రక్షణ గోడ కూలిన ఘటనతో పాటు పాలనాపరమైన వైఫల్యాలపై ఆలయ మాజీ ఈవో వి.త్రినాథరావుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆయనకు చార్జ్ మెమో జారీ చేసింది. గతంలో రక్షణ గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.అలాగే ప్రసాద్ పథకం అమలులో నిర్లక్ష్యం, భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనలో జాప్యానికి బాధ్యుడిగా త్రినాథరావును పేర్కొంటూ మోమో ఇచ్చింది.

News January 9, 2026

17 నోటిఫికేషన్లు.. 20న హాల్‌టికెట్లు

image

AP: గత ఏడాది జారీ చేసిన 17 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 20న విడుదల చేస్తామని APPSC వెల్లడించింది. https://psc.ap.gov.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. నోటిఫికేషన్ల వివరాల కోసం పైన ఫొటోను స్వైప్ చేయండి.

News January 9, 2026

ప.గో: మద్యం తాగి దొరికితే రూ.10 వేల జరిమానా!

image

నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ.10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు.