News December 20, 2025
ఆ వాహనాలు ఎవరికోసమో….?

తిరుపతి డివిజన్‌లో డిసెంబర్ 20న సీజ్ చేసిన వాహనాల వేలం నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో మొత్తం 375 వాహనాలకు టెండర్లకు ఆహ్వానం ఇచ్చినా 305 వాహనాలకే టెండర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 70 వాహనాల వివరాలను రౌండప్ చేసి, వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వేలంలో పాల్గొనే వారిలో తీవ్ర అయోమయం నెలకొంది. ఆ వాహనాలు ఎందుకు పక్కనబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
Similar News
News December 24, 2025
పెద్దపల్లి: యూరియా యాప్‌లో సాంకేతిక చిక్కులు

ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పైలెట్ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. PDPL(D)లో పరిశీలించగా కౌలురైతుల వివరాలు, ఫోన్ నంబర్ల అప్‌డేట్, డిజిటల్ సంతకం లేని భూముల నమోదులో ఇబ్బందులు గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్ది, 4రోజుల్లో TGవ్యాప్తంగా యాప్‌ను ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 3టన్నుల యూరియా బుకింగ్ జరిగినట్లు సమాచారం.
News December 24, 2025
మన్యం: గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ ముస్తాబు

గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ ముస్తాబు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిని అర్థం చేసుకోవడానికి ‘గిరిజనుల ఇళ్లకు వెళ్లానున్న ఎంపీడీవోలు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో తమ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను సందర్శిస్తారన్నారు. వారికి ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
News December 24, 2025
విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్

TG: ఖమ్మం(D)లోని నాయకన్‌గూడెంలో విషాదం చోటు చేసుకుంది. పెన్సిల్ చిన్నారి పాలిట యమపాశంలా మారింది. ప్రైవేట్ స్కూల్‌లో UKG చదువుతున్న విహార్(6) జేబులో పెన్సిల్ పెట్టుకొని స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడిపోగా జేబులోని పెన్సిల్ ఛాతిలో గుచ్చుకొని కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


