News April 21, 2024
స్టార్ హీరో విజయ్‌పై కేసు?

తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ సామాజిక కార్యకర్త కేసు పెట్టినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ నెల 19న పోలింగ్ సమయంలో విజయ్ వల్ల అక్కడ ఉన్నవారికి ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి. పోలింగ్ బూత్‌కు విజయ్ తన మద్దతుదారులతో వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించాయి.
Similar News
News February 7, 2026
Vi నుంచి అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్!

వొడాఫోన్ ఐడియా (Vi) ‘నాన్-స్టాప్ హీరో’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా కాల్స్, అన్‌లిమిటెడ్ 4G/5G డేటా & 100 SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రూ.365 (28 రోజులు), రూ.649 (56 రోజులు), రూ.979 (84 రోజులు) ప్లాన్లతో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. కొన్ని ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
News February 7, 2026
యానిమేషన్ రూపంలో RRR మూవీ: రాజమౌళి

Jr.NTR, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRRపై దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘RRR మూవీకి యానిమేషన్ అడాప్షన్ విషయంలో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే పలు జపనీస్ కంపెనీలతో మాట్లాడాం. ఇంకా ఏదీ అధికారికంగా ప్రారంభం కాలేదు’ అని తెలిపారు. RRR కథకు ఇది కంటిన్యూషన్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ‘బాహుబలి- ది ఎటర్నల్ వార్ పార్ట్-1’ యానిమేషన్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 7, 2026
ఐటీకి హైటెక్ సిటీ.. క్వాంటమ్‌కి అమరావతి: CBN

AP: దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో పునాది పడటం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఐటీ రెవల్యూషన్‌కి హైటెక్ సిటీ ఏం సాధించిందో, క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతి అచీవ్ చేస్తుంది. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం’ అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తామని ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రారంభోత్సవ సభలో చెప్పారు.


