News December 20, 2025

బాపట్ల: అమ్మ కష్టం ఫలించింది.. SIగా కొడుకు బాధ్యతలు

image

జె.పంగులూరుకు చెందిన పవన్‌కుమార్ మాచవరం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం SIగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. తల్లి సునీత కూలి పనులు చేస్తూ చదివించి కొడుకును ఉన్నత స్థాయికి చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం కలగా మిగిలిన ఆ కుటుంబంలోనే తొలి ప్రభుత్వ ఉద్యోగిగా SI పోస్టు సాధించి అమ్మ కష్టాన్ని తీర్చారు. అమ్మ కష్టం ఫలించి కొడుకు SIగా బాధ్యతలు స్వీకరించారని స్థానికులు కొనియాడారు.

Similar News

News December 26, 2025

అమ్మ సెంటిమెంట్.. మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్

image

సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాశ్‌ను ఓ వ్యక్తి SMలో సాయం కోరాడు. ఓ ఫొటోను షేర్ చేసి.. అమ్మ చనిపోయిందని అంత్యక్రియలకు డబ్బుల్లేవని తెలిపాడు. దీంతో చలించిపోయిన జీవీ ప్రకాశ్.. రూ.20,000 పంపించారు. అయితే ఆ ఫొటో 2022 నాటిదని, తాను మోసపోయానని తర్వాత గుర్తించారు. అమ్మ పేరుతో మోసం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సాయం చేసిన GVని ప్రశంసిస్తున్నారు.

News December 26, 2025

ఆస్ట్రేలియా దెబ్బ.. కుప్పకూలిన ఇంగ్లండ్

image

ASHES SERIES: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఫస్ట్ డేనే రెండు జట్లు కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా ఇంగ్లండ్ అంతకంటే ఘోరంగా 110 రన్స్‌కే చాప చుట్టేసింది. హ్యారీ బ్రూక్ (41), స్టోక్స్ (16), అట్కిన్సన్ (28) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.

News December 26, 2025

మంచిర్యాల: మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సమాయత్తం

image

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థుల గెలుపునకు ఏకతాటిపైకి తెస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.