News December 20, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 13, 2026

తెనాలి: వీడుతున్న హత్య కేసు మిస్టరీ..!

image

తెనాలి టీచర్స్ కాలనీలో జరిగిన షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యకేసు మిస్టరీ వీడుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫయాజ్ సహజీవనం చేస్తున్న ఓ మహిళ సహా హత్యకు పాల్పడిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన మహిళ ముత్యంశెట్టిపాలెంకి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఫయాజ్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది.

News January 12, 2026

PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

image

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.

News January 12, 2026

GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.