News April 21, 2024
దర్శిలో టీడీపీ నేతకు ప్రమాదం.. స్పందించిన నారా లోకేశ్

దర్శి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. నాదెండ్ల బ్రహ్మం ప్రమాదంలో గాయపడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఫోన్లో వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. బ్రహ్మంకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News October 11, 2025
వారిపై నిఘా ఉంచండి: గుంటూరు రేంజ్ IG

రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు దీపావళి భద్రతపై అవగాహన కల్పించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులతో ఐజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ఆర్థికనేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
News October 11, 2025
ప్రకాశం: ‘అర్జీలు సకాలంలో పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వచ్చే అర్జీలలో 80% రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలే ఉన్నాయన్నారు. నిర్ణీత గడువులోగా అర్జీలను అధికారులు పరిష్కరించాలన్నారు.
News October 10, 2025
త్వరలో ఉమ్మడి ప్రకాశంకు మహర్ధశ: CM

కృష్ణపట్నంతో పాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు CM చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా దగదర్తి ఎయిర్ పోర్ట్ పూర్తయితే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దీని వలన పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఒంగోలు మీదుగా HYD-చెన్నై, చెన్నై-అమరావతికి బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 కల్లా AP ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు.