News December 20, 2025
VZM: పశువుల యజమానులకు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలితే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ హెచ్చరించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో రోడ్డుపై తిరుగుతున్న పశువులను శుక్రవారం తరలించారు. ఈ నేపథ్యంలో SP మాట్లాడుతూ.. పశువుల వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిచ్చగాళ్లపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News January 17, 2026
VZM: పండగకి ఇంత తాగేశారా..!

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News January 17, 2026
విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.