News December 20, 2025
పల్స్ పోలియోని విజయవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో 966 పోలియో బూత్‌ల ద్వారా 0-5 ఏళ్లలోపు 2,48,900 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Similar News
News January 20, 2026
జనగామ: ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత సహాయ ఉపకరణాలు అందించనుంది. 2024-25 సంవత్సరానికి గాను బ్యాటరీ వీల్‌చైర్లు, ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, చేతి కర్రలు తదితర పరికరాల కోసం అర్హులైన వారు ఈనెల 30వ తేదీలోపు https://tgobmms.cgg.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా సంక్షేమ అధికారి కే.కోదండ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
News January 20, 2026
గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.
News January 20, 2026
సిరిసిల్ల: ‘రంజాన్ పండుగకు అన్ని వసతులు కల్పించాలి’

రానున్న రంజాన్ పండుగకు ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. రంజాన్ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసులతో జిల్లాలోని అన్ని మసీద్ కమిటీల అధ్యక్షులు, మైనార్టీ సంఘం ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


