News December 20, 2025
హుజూర్‌నగర్: సర్పంచ్‌లకు నేడు మంత్రి ఉత్తమ్ సన్మానం

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించనున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ సన్మాన కార్యక్రమం మార్పు చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నేడు (డిసెంబర్ 20) సా.4 గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండన్య ఫంక్షన్ హాల్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News December 25, 2025
మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
News December 25, 2025
ఈనెల 31లోపు సర్వే పూర్తి చేయండి: సంగారెడ్డి డీఈఓ

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఈనెల 31 లోపు బడి బయట పిల్లలను గుర్తిచేందుకు సర్వే నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. గ్రామ, పాఠశాల, పట్టణ పరిధిలోని 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలను సేకరించాలన్నారు. ఆ వివరాలను ప్రబంధ పోర్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
News December 25, 2025
వనపర్తి జిల్లా సర్వే అధికారిగా శ్రీనివాసులు

వనపర్తి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా పి.శ్రీనివాసులు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బదిలీల ప్రక్రియలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న జె.బాలకృష్ణ నల్గొండ జిల్లా భూసేకరణ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆందోల్ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, పదోన్నతిపై వనపర్తి జిల్లా సర్వే అధికారిగా నియమితులయ్యారు.


