News December 20, 2025
హుజూర్‌నగర్: సర్పంచ్‌లకు నేడు మంత్రి ఉత్తమ్ సన్మానం

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించనున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ సన్మాన కార్యక్రమం మార్పు చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నేడు (డిసెంబర్ 20) సా.4 గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండన్య ఫంక్షన్ హాల్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News January 17, 2026
GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News January 17, 2026
ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరం: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్స్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ సూచించారు. ఫైల్స్ ఓపెన్ చేస్తే సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి ఫైల్స్ ఓపెన్ చేస్తే మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.
News January 17, 2026
ప్రశాంతంగా రిజర్వేషన్ల ఖరారు: నిర్మల్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కలెక్టరేట్‌లో శనివారం పూర్తయింది. పార్టీ ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎస్టీ,ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు వార్డులు కేటాయించినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిబంధనల ప్రకారం సిపెక్ సర్వే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయగా, మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు.


