News December 20, 2025
ADB: తాము ఓడిపోయి.. తమ వాళ్లను ఓడగొట్టుకొని

పంచాయతీ ఎన్నికల్లో కొందరు తాము ఓడిపోవడమే కాకుండా తమ వాళ్లను సైతం ఓడించుకున్నారు. పదవిపై ఆశ మనిషిని దూరం చేస్తుందనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత చాలామందికి అర్థమయింది. చాలా ఏళ్ల తర్వాత ADBలో అనేక గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటివరకు ఒకటిగా ఉన్నా వర్గంలో చీలికలు మొదలయ్యాయి. నేనంటే నేను పోటీ చేస్తానని అందరూ బరిలో దిగారు. చివరకు వారి ఓట్లు చీలి అవతలి వ్యక్తి గెలివడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.
Similar News
News January 19, 2026
పెద్దపల్లి: సర్పంచ్‌ల ‘శిక్షణ’ షురూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలకు మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల సర్పంచ్‌లు శిక్షణా కేంద్రానికి హాజరయ్యారు.
News January 19, 2026
బిచ్చగాడి ఆస్తుల చిట్టా.. దెబ్బకు ఆఫీసర్లే షాకయ్యారు!

MPలోని ఇండోర్‌లో అధికారులకు షాకిచ్చాడో బిచ్చగాడు. బెగ్గర్లు లేని సిటీగా మార్చాలని డ్రైవ్ నిర్వహిస్తుండగా సరాఫా బజార్‌లో మంగీలాల్ అనే వికలాంగుడు కనిపించాడు. ఆరా తీయగా అతడి ఆస్తుల చిట్టా బయటపడింది. 3 ఇళ్లు, 3 ఆటోలు, ఓ కారు ఉన్నాయి. ఆటోలను అద్దెకు తిప్పుతుండగా, కారు కోసం ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. రోజుకు ₹500-1000 భిక్షాటనతో సంపాదిస్తున్నాడు. బంగారు వ్యాపారులకు అప్పు కూడా ఇస్తాడట.
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.


