News December 20, 2025
యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: భువనగిరి కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ (సోమవారం) నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.
Similar News
News January 1, 2026
శాతవాహన పరిశోధన అభివృద్ధి కేంద్ర సంచాలకులుగా డాక్టర్ జాఫర్

శాతవాహన విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ గా డా.మహమ్మద్ జాఫర్ నియమకయ్యరు. ఈ మేరకు SU VC ఆచార్య యు.ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. జాఫర్ ఉర్దూ విభాగంలో సహ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ గా పని చేశారు. 2020లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు అందుకున్నారు.
News January 1, 2026
కుష్టు వ్యాధి సర్వే పూర్తి: DMHO తుకారం రాథోడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తయినట్లుగా DM&HO డా.తుకారం రాథోడ్ తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు జరిగిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో 1,436 బృందాలు పాల్గొని 2,47,693 ఇళ్లను సందర్శించారని చెప్పారు. మొత్తం 8,89,635 మందిని క్షుణ్ణంగా పరిశీలించి 1,708 మంది కుష్ఠు అనుమానితులుగా గుర్తించామన్నారు. వారికి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
News January 1, 2026
శాతవాహన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా డా.కే.పద్మావతి

శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ కే.పద్మావతి SU VC యు.ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. సమాజ శాస్ర సహా ఆచార్యులుగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. 2008లో సహాయ ఆచార్యులుగా నియామకమై తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డి టు విసి డా.డి హరికాంత్ ఉన్నారు.


