News December 20, 2025

పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి: నల్గొండ కలెక్టర్

image

ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రామిక్ ఉన్నారు.

Similar News

News December 28, 2025

జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

image

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.

News December 28, 2025

NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

image

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.

News December 28, 2025

వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.