News December 20, 2025
వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రద్దు

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని డీసీసీబీ బ్యాంక్‌తో పాటు అనుబంధంగా ఉన్న 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకమండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. పాలకవర్గాల కాలపరిమితి ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంఘాల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా తక్షణమే పర్సన్ ఇన్‌చార్జిల నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. పీఏసీఎస్ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాకే కొత్త ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
Similar News
News January 9, 2026
పార్వతీపురం: ప్రతి 70 ఇళ్లకు ఒక క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ సక్రమంగా అందేలా చూడటమే లక్ష్యంగా జిల్లాలో వినూత్న చర్యలు చేపడుతున్నట్లు జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్వతీపురం జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్‌లో గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 70 ఇళ్లకు ఒక క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు ఆయన వెల్లడించారు.
News January 9, 2026
ANU పీజీ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో పీజీ పరీక్ష షెడ్యూల్‌ను పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. LLB, LLM, MSC యోగ, PG డిప్లొమా ఇన్ యోగా తదితర పరీక్షలకు సంబంధించి ఫీజు షెడ్యూల్ విడుదల చేశామన్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News January 9, 2026
హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్!

హుస్సేన్‌సాగర్.. ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం, NTR మార్గ్‌లో స్ఫూర్తినిచ్చే భారీ అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్‌పై ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే తెలంగాణ అమరుల స్థూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఇక్కడ సందర్శకుల సందడి ఉంటుంది. ఇంకా ఆ పక్కనే తెలంగాణ సచివాలయం స్పాట్ అందరికీ ఫేవరెట్. వినోదం కోసం లుంబిని పార్క్, ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో HMDA నైట్ బజార్‌కు ప్లాన్ వేస్తోంది.


