News December 20, 2025
అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్‌లో ఉద్యోగి ల్యాండ్

నేవీ ఉద్యోగి పారాచూట్‌పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.
Similar News
News January 23, 2026
నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా భద్రత, గంజాయి రవాణా అడ్డుకట్ట, సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నగర DCPలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News January 22, 2026
ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.
News January 22, 2026
ఏయూలో పాలన గాడి తప్పిందా?

ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.


